
సోషల్ మీడియాలో షేర్ చేసే మెసేజ్ లు, వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజమో కాదో తెలుసుకోకుండానే పోస్ట్ చేయడం.. తర్వాత నవ్వుల పాలవడం జరుగుతుంది. ఇలా చాలా మంది ఇటీవల ఫేక్ వీడియోలు పోస్ట్ చేసి అభాసు పాలయ్యారు. లేటెస్ట్ గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఇలాంటిదే ఒక ఫేక్ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఎది తప్పో…ఏది ఒప్పో తెలుసుకోకుండా ఇలాంటి ఫేక్ వీడియోలు ఎలా పోస్ట్ చేస్తారంటూ విమర్శలు చేస్తున్నారు.
— Kiran Bedi (@thekiranbedi) January 4, 2020
ఇంతకీ కిరణ్ బేడీ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే…సూర్యుడు ఓం అని అంటున్నాడు..ఈ సౌండ్ ను నాసా రికార్డ్ చేసిందని అందులో ఉంది. అయితే ఇది ఫేక్ వీడియో.. చాలా రోజుల నుంచే ఈ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలైన వీడియోను నాసా రికార్డ్ చేసింది కానీ అందులో ఓంకారం అనే సౌండ్ ఉండదు. ఈ వీడియోను నాసా గతంలోనే రిలీజ్ చేసింది. ఈ విషయం తెలియక ఫేక్ వీడియో పోస్ట్ చేసిన కిరణ్ బేడీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మేడమ్ అసలైన వీడియో ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీలాంటి వారు ఫేక్ వీడియోలు నమ్మి పోస్ట్ చేస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.