టీ20 టోర్నమెంట్ ను ఆపేందుకు కిరణ్ బేడీ ప్లాన్

టీ20 టోర్నమెంట్ ను ఆపేందుకు కిరణ్ బేడీ ప్లాన్

కేంద్ర పాలిత ప్రాంతం  పుదచ్చేరి టి20 లీగ్ 2020 టోర్నమెంట్  నవంబర్ 11 నుండి 27 వరకు జరగనుంది. ఈ ఈవెంట్ లో ఆరు టీంలు ఆడనున్నాయి. అన్ని మ్యాచ్‌లు క్రికెట్ అసోసియేషన్ పాండిచేరి(సీఏపీ) సిచెమ్ మైదానంలో జరగనున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ ను లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఆ రాష్ట్ర క్రీడా మంత్రి  మల్లాడి కృష్ణారావు ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కిరణ్ బేడీ టోర్నమెంట్ పట్ల అసూయతో ఉన్నారన్నారు. టీ20 టోర్నమెంట్ నిర్వహించడానికి అధికార పార్టీ, ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి.. కానీ కిరణ్ బేడీ తన వ్యక్తిగత పేరు ప్రఖ్యాతల కోసం ఆపే ప్రయత్నం చేస్తుందన్నారు. శివార్లలోని  ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆక్రమించినందుకు   క్రికెట్ స్టేడియం  ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని కిరణ్ బేడి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి  మల్లాడి కృష్ణారావు కిరణ్ బేడీపై వ్యాఖ్యలు చేశారు.

సరిహద్దులో జవాన్ల దీపావళి వేడుకలు