క్రీడా ఆధ్వర్యంలో కిసాన్ మేళా

క్రీడా ఆధ్వర్యంలో కిసాన్ మేళా

వెలుగు, కోటపల్లి: భారతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ(క్రీడా) ఆధ్వర్యంలో కోట పల్లి మండలం ఆలుగాములో కిసాన్ మేళా కార్యక్రమం జరిగింది. పాల్గొన్న డైరెక్టర్ వీకే సింగ్ కూరగాయల సాగుపై రైతులకు మెలకువలు వివరించారు. సాంకేతికత ఉపయోగించి రైతులు అధిక దిగుబడులు పొందాలని సూచించారు. సబ్సిడీ ద్వారా ప్రతి వస్తువు అందుబాటులో ఉంటుందన్నారు.  

ఎస్సీ సబ్ ప్లాన్ కింద రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలు అందించారు. డ్రోన్ స్ప్రేయర్​తో మందు పిచికారి విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సైంటిస్టులు డా.ఎస్ఎస్ బల్లోలి, డా.కేఎస్ రెడ్డి, డా.శ్రీదేవి శంకర్, డా.జి.వెంకటేశ్, నోడల్​అధికారి డా.టీవీ ప్రసాద్, ఇతర అధికారులు, ప్రస్తుత మాజీ సర్పంచ్ కుమ్మరి సంతోష్, రైతులు పాల్గొన్నారు.