కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్ : కిషన్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్  : కిషన్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఐదేండ్లల్లో ఎన్ని టీఎంసీలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల సంపదను దోచుకునేందుకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై...కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. కుటుంబ, అవినీతికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కవల పిల్లలని విమర్శించారు. 

దసరా తర్వాత రెండో జాబితా విడుదల ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. జనసేనతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 2023 అక్టోబర్  27వ తేదీన తెలంగాణకు  కేంద్రమంత్రి అమిత్‌షా రాబోతున్నారని, ఈ నెల చివరివారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వస్తారని తెలిపారు.  

దసరా తర్వాత విస్త్రృతంగా ప్రచారం చేస్తామని,  అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.  బీఆర్ఎస్ వ్యతిరేకతను  బీజేపీకి అనుకూలంగా మార్చకుంటామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని కాళేశ్వరం  కోరారు.