లంబాడీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నం

లంబాడీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నం
  • వరదలపై కేంద్ర బృందం టూర్ స్టార్ట్ అయింది
  • బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్ రెడ్డి 
  • వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు 

హైదరాబాద్ :  లంబాడీలపై ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని బీజేపీ తెలంగాణ స్టేట్   చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి   స్పష్టం  చేశారు. లంబాడీలకు రిజర్వేషన్ లపై బీజేపీ కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే లంబాడీలకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.   పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఇవాళ పార్టీ స్టేట్ ఆఫీస్ లో జరిగిన ప్రోగ్రామ్ లో బీజేపీలో చేరారు.  

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే  సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.   సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్ ను ఓడించి రాష్ట్రంలో పవర్ లోకి వస్తామని .  కేంద్ర బృందాలు నేటి నుంచి వరద ప్రాంతాల్లో పర్యటిస్తాయని తెలిపారు.  

రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ. 900 కోట్లు ఎస్డీఆర్ఎఫ్ నిధులున్నా ఖర్చు చేయడం లేదని విమర్శించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు కలసి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాయని, సోనియా గాంధీ, కల్వకుంట్ల కుటుంబం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పనిచేస్తున్నాయని విమర్శించారు. చేరికల ప్రోగ్రామ్ లో   బూర నర్సయ్య గౌడ్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, మంచిర్యాల  జిల్లా అధ్యక్షుడు రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ అన్ని సీట్లు గెలుస్తాం : వివేక్ వెంకటస్వామి

ఉమ్మడి అదిలాబాద్ లో బీజేపీ  అన్ని సీట్లు బీజేపీ గెలిచే అకాశముందని, బీ ఆర్ ఎస్ రాక్షస పాలన పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. స్టేట్ లో బీజేపీ  కిషన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తుందన్నారు. బండి సంజయ్ కి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి రావడం సంతోషంగా ఉందని చెప్పారు.