కాకా తనయుడు వివేక్ రాకతో బీజేపీ బలపడింది : కిషన్ రెడ్డి

కాకా తనయుడు వివేక్ రాకతో బీజేపీ బలపడింది : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో కీలక నాయకుడిగా పనిచేసి, కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వశాఖలు నిర్వహించి, తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ప్రతినిధి అనిపించుున్న కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి కుమారుడు వివేక్ ను.. బీజేపీలోకి మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. విద్యార్థి దశనుంచే సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన వివేక్ వెంకటస్వామి…. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. నియంతృత్వ ప్రభుత్వం పోవాలనే ఆకాంక్షతో పార్టీలోకి వచ్చారని చెప్పారు.

వివేక్ రాక బీజేపీకి బలం ఇస్తుందన్నారు కిషన్ రెడ్డి. అన్ని వర్గాల వారిని కలుపుకుపోతామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి.. జాతీయ స్థాయి వరకు.. బీజేపీ రోజురోజుకూ బలోపేతం అవుతోందన్నారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడబోతోందని చెప్పారు కిషన్ రెడ్డి.