కేసీఆర్ సర్కార్ పై తెలంగాణ బీజేపీ పోరుబాట పట్టింది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేస్తూ.. శనివారం (ఆగస్టు 12వ తేదీన ) హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణిపై కార్యాచరణ ప్రకటించారు.
బీజేపీ కార్యాచరణ ఇదే..
* ఆగస్టు 16, 17వ తేదీల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బస్తీల్లో పర్యటించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
* బస్తీల్లో నిరుపేదలను కలిసి.. వారి సమస్యలను తెలుసుకోవాలని, దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు.
* డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆగస్టు18వ తేదీన మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు.
* ఆగస్టు 23, 24 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
* సెప్టెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లో విశ్వరూప ధర్నా చేపట్టాలంటూ పార్టీ శ్రేణులను కిషన్ రెడ్డి ఆదేశించారు.