
ప్రధాని మోడీపై AP సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. మోడీతో కేసీఆర్, జగన్ కు సంబంధం ఉందని బాబు అంటున్నారని ఫైర్ అయ్యారు. ఐదేళ్లో చంద్రబాబు APని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. 50 ఏళ్లుగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీ.. నాశనం చేసిందన్నారు. మరోసారి ప్రధాని మోడీ అవుతారని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.