చరిత్రను భావి తరాలకు అందించేవే మ్యూజియాలు: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

చరిత్రను భావి తరాలకు అందించేవే మ్యూజియాలు: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

హైదరాబాద్​, వెలుగు:  వేల ఏండ్ల చరిత్రను, సంస్కృతిని, జీవన విధానాలను భావితరాలకు అందిచేవే మ్యూజియాలు అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్​రెడ్డి పేర్కొన్నారు.   హైదరాబాద్​లోని సాలార్​జంగ్​ మ్యూజియంలో ఆదివారం 5  కొత్త గ్యాలరీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ మ్యూజియం 72  ఏండ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటుందని, మారుతున్న కాలానికి అనుగుణంగా డెవలప్​చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 

2వ శతాబ్దం నాటి బోధిసత్వ మైత్రేయ చిత్రం నుంచి,3వ శతాబ్దంలోని ఇక్ష్వాకుల కాలంనాటి బుద్ధ విగ్రహం కూడా మ్యూజియంలో ఉందని, ఇది ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బయటపడిందని గుర్తుచేశారు.  తెలంగాణలో దశాబ్దాల తర్వాత వెయ్యి స్తంభాల గుడిని పునరుద్ధరిస్తున్నామని, వరంగల్​పోర్ట్ ను కూడా డెవలప్​ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సాలార్​జంగ్​ మ్యూజియం డైరెక్టర్​ఆశిష్​గోయల్, ఆచార్య కిషన్ రావు, ప్రముఖ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎక్కా యాదగిరిరావు, వై. సుదర్శన్ రావు, ఎ. నాగేంద్రరెడ్డి, రాణి రుద్రమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.