ఏప్రిల్ 19న కిషన్ రెడ్డి నామినేషన్

ఏప్రిల్ 19న కిషన్ రెడ్డి నామినేషన్
  •     హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ 

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల19న నామినేషన్ వేయనున్నారు. ఆయన నామినేషన్‌‌‌‌‌‌‌‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 18న రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ హైదరాబాద్ రానున్నారు. అలాగే, సికింద్రాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని యాదవ సంఘాలతో సమావేశమయ్యేందుకు ఈ నెల 21న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రాష్ట్రానికి రానున్నారు.