ప్రతి ఒక్కరూ యోగా చేయాలి: కిషన్ రెడ్డి

ప్రతి ఒక్కరూ యోగా చేయాలి: కిషన్ రెడ్డి

యోగా మన జీవన విధానం..మన సంపద అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మే 27వ తేదీ శనివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యోగా మహోత్సవ్ కార్యక్రమం జరిగింది. జూన్ 21న నిర్వహించనున్న ఇంటర్నేషనల్ యోగా డే సందర్బంగా 25 రోజు ముందే కౌంట్ డౌన్ యోగా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో కిషన్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళ సై, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ముంజపరా మహేంద్ర పాల్గొన్నారు. అనంతంర కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. యోగా ప్రయోజనలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ప్రజలందరినీ మరింత చైతన్యం చేయడం కోసం ఈ ఏడాది యోగా డేకు 100 రోజుల ముందే శ్రీకారం చుట్టిందన్నారు.

ఈ రోజు యోగలో 100 కి పైగా యోగ సంస్థల పెద్దలు పాల్గొన్నారు. 25 రోజుల కౌన్ డౌన్ ఏకైక కార్యక్రమం ప్రభుత్వం తరుపున భారత దేశంలో మన హైదరాబాద్ లో జరుగుతుంది. యోగ మన జీవన విధానం..మన సంపద. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగ డే న ప్రతి ఒక్కరు యోగ చేయాలి. దేశగానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కాగా  ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకొంటున్నాం. నరేంద్ర మోడీ యోగను ప్రపంచం అంతటా తెలియజేశారు. యోగ డేను ప్రపంచం అంతటా జరుపుకొంటుంది.

గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగ డే జరుపుకొంటున్నాం. దివాళి, ఉగాదిలా యోగ ఒక పండుగల సంతోషంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ప్రధానమంత్రి కోరుకొంటున్నారు. కౌన్ డౌన్ కి హైదరాబాద్  వేదిక అవ్వడం గొప్ప విషయం. ఇది చరిత్రలో నిలిచపోయే రోజు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి యోగ చేయాలి. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద.. కులం మతం అని తేడా లేకుండా కలిసి యూనిటీగా  యోగ చేస్తున్నారు. జూన్ 21 అంటే ఫెస్టివల్ ఆఫ్ హెల్త్. ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమం యోగా మహోత్సవ్ హైదరాబాద్ లో ప్రారంభించడం గర్వకారణం. యోగా అభ్యాసం ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి.

కేంద్ర మంత్రి డా.ముంజపరా మహేంద్ర మాట్లాడుతూ.. 2023 లో యోగ డే కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 25 డేస్ యోగ డే కౌంట్ డౌన్ కి హైదరాబాద్ వేదిక అయింది. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగ డే ఘనంగా ప్రపంచం అంతటా జరుపుకొంటుంది. ప్రధాని మోడీ ఇంటర్నేషనల్ యోగ డేకి కృషి చేశారు. ప్రజలు అందరూ యోగ ఉపయోగాలు తెలుసుకొని యోగ చేయాలి.

ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ముంజపరా మహేంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘు నందన్, ఓబీసీ మోర్చా లక్ష్మణ్, పుల్లెల గోపిచందన్, హీరో  విశ్వక్ సేన్, హీరోయిన్లు ఇషా రెబ్బ, శ్రీ లీల, డైరెక్టర్ కృష్ణ చైతన్య, బ్యాట్మెంటన్ ప్లేయర్ నైనా జైశ్వల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.