నైతిక విలువలకు నిలువెత్తు రూపం వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి : కిషన్ రెడ్డి

నైతిక విలువలకు నిలువెత్తు రూపం వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి : కిషన్ రెడ్డి
  •     ఒక్క ఓటు కోసం పదవిని వదిలేసిండు: కిషన్ రెడ్డి 
  •     అమెరికా బెదిరించినా అణుపరీక్షలు చేసిన ధీశాలి అని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: నైతిక విలువలకు నిలువెత్తు రూపం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి అని, ఒక్క ఓటు కోసం.. నైతికతకు కట్టుబడి ప్రధాని పదవిని తృణప్రాయంగా వదిలేసిన మహోన్నత నేత అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. 

గురువారం బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, మాట్లాడారు. వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి జీవితం దేశ యువతకు ఆదర్శమన్నారు. గతంలో ఏ ప్రధాని సాహసించని విధంగా నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. అమెరికా వంటి అగ్ర దేశాలు బెదిరింపులకు పాల్పడినా లెక్కచేయకుండా ఫోఖ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అణు పరీక్షలు జరిపి, భారత్ సత్తాను ప్రపంచానికి చాటారన్నారు. 

దేశ రక్షణ, గౌరవం విషయంలో ఆయన ఎప్పుడూ రాజీపడలేదని చెప్పారు. స్నేహహస్తం కోసం ఢిల్లీ నుంచి లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బస్సులో వెళ్లిన తొలి ప్రధాని వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి అని, కానీ పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచినప్పుడు మాత్రం ఉపేక్షించలేదన్నారు. కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యానికి మూడు చెరువుల నీళ్లు తాగించి, మట్టికరిపించిన ఘనత వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి సొంతమన్నారు. దేశంలో రోడ్ల విప్లవానికి వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి నాంది పలికారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎన్.గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, వేముల అశోక్, ఆ పార్టీ నేతలు బద్దం మైపాల్ రెడ్డి, బండారు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.