కేసీఆర్ చెప్పినట్లే పోలీసులు నడుచుకున్నరు:కిషన్ రెడ్డి

కేసీఆర్ చెప్పినట్లే పోలీసులు నడుచుకున్నరు:కిషన్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పోలీసు అధికారులు అధికార ప్టారీకీ అనుకూలంగా వ్వవహరించారని ఆరోపించారు.

    కిషన్ రెడ్డి వ్యాఖ్యలు:

  • పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. 
  • కేసీఆర్ చెప్పినట్లే పోలీసులు నడుచుకున్నారు.
  •  పోలీసుల ముందే విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణి జరిగింది.
  • అనేక నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి.
  • ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం.
  • సాగర్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఈరోజు జరిగన ఘటనను ఖండిస్తున్నా..ఇది ఏమాత్రం మంచిది కాదు.
  • దుందుడుకు విధానంతో ఎపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు.
  • ఏకపక్షంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి సాగర్ నీళ్లు తరలించడం సరైన పద్దతి కాదు.
  • ఇది వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల కుట్ర
  • ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయి