ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం ఎన్నికల స్ట్రాటజీ: కిషన్ రెడ్డి

ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం ఎన్నికల స్ట్రాటజీ: కిషన్ రెడ్డి

తెలంగాణ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని చెప్పారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం తమ పార్టీ ఎన్నికల స్ట్రాటజీ అన్నారు. అభ్యర్థులను  ఎప్పడు ప్రకటించాలన్నది తమ  ఇష్టమని..నామినేషన్ చివరి వరకు  ప్రకటించే అవకాశముందన్నారు.  అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే 50 శాతం పూర్తయిందన్నారు. 

ఇప్పటికే రెండు సార్లు ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రులు,బీజేపీ నాయకులు త్వరలో మరి కొంత మంది తెలంగాణలో ప్రచారానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే చాలా మంది బీజేపీలో చేరుతున్నారని.. ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కాజిపేట-హడప్సర్ (పుణే) రైలును జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దీంతోపాటుగా మరో మూడు రైళ్లను వర్చువల్ గా ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ఈ నాలుగు రైళ్ళను పొడిగించింది. 

హడప్సర్‌ -హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కాజీపేట వరకు పొడిగించారు. అలాగే జైపూర్‌ - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూలు సిటీ వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.