వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు

వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు

తెలుగు  పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశ వ్యాప్తంగా ఘనంగా ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు.   అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి మోడీని ఒప్పించానన్నారు. అల్లూరి తిరిగిన ప్రాంతాలను తీర్థ స్థలాలుగా మారుస్తామన్నారు. అల్లూరి కుటుంబ సభ్యులను కలుస్తామన్నారు. వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు జరుగతాన్నారు.  అల్లూరి జీవిత చరిత్రను ప్రజలకు వివరిస్తామన్నారు. అంతకు ముందు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంలో దిగిన మోడీకి సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషన్ ఘన స్వాగతం పలికారు.