కేంద్ర మంత్రి హోదాలో కిషన్‌రెడ్డి తొలి విదేశీ పర్యటన

కేంద్ర మంత్రి హోదాలో కిషన్‌రెడ్డి తొలి విదేశీ పర్యటన

బీజేపీ నేత, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్‌రెడ్డి తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఆస్ట్రేలియాలో జరిగే ఉగ్రవాద ప్రభావిత దేశాల హోంమంత్రుల సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. కేంద్రమంత్రి హోదాలో కిషన్‌రెడ్డి సమావేశంలో మాట్లాడనున్నారు. దౌత్య వ్యవహారాలపై వివిధ దేశాల హోంమంత్రులతో కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా సమావేశం కానున్నారు.