రాష్ట్ర ప్రభుత్వ తీరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు. డిజస్టర్ మేనేజ్మెంట్ వద్ద ఉన్న కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలన్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని మంత్రులు చెప్పడం తప్పన్నారు . తార్నాక మాణికేశ్వర్ లో వరద బాధితులను ఆయన పరామర్శించారు. వర్షాలకు ఇళ్లు కూలిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలన్నారు కిషన్ రెడ్డి. సెంట్రల్ టీం వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇస్తుందని చెప్పారు. ఆ నివేదిక ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నిధులు అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాననికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు.
