ప్రత్యర్థిపై 14,836 ఓట్లతో కిషన్ రెడ్డి విజయం

ప్రత్యర్థిపై 14,836 ఓట్లతో కిషన్ రెడ్డి విజయం

సికింద్రాబాద్: దేశంలోనే కాదు, రాష్ట్రంలో కూడా బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న బీజీపీ.. ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంది. అందులో ఒకటైన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి BJP అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపును సొంతం చేసుకున్నారు. తన సమీప ప్రత్యర్థి, TRS అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ పై 14,836 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. మొత్తం 112,988 ఓట్లు పోల్ అయిన ఈ ఓటింగ్ లో 1272 ఓట్లు నోటా కు పడ్డాయి.