ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించండి

ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించండి

ఆర్థికంగా వెనుకబాటుకు గురైన వారి గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు.తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలలో,విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.మూడేళ్ల నుంచి ఆర్థిక వెనుకబాటు గురైన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయట్లేదన్నారు.

తెలంగాణలో ఆర్ధికంగా వెనుకబడిన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు  మంత్రి కిషన్ రెడ్డి.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణతో ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరగడం లేదన్నారు.దేశవ్యాప్తంగా 158 కేంద్ర విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు అదనంగా 2.15 లక్షల సీట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.4315.15 కోట్లను కేటాయించిందని చెప్పారు కిషన్ రెడ్డి.

మరిన్ని వార్తల కోసం..

బిగ్‌బాస్ నుండి తప్పుకున్న కమల్‌హాసన్‌