జీడిమెట్ల, వెలుగు : ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం అలవాటుగా మార్చుకోవాలని మేడ్చల్ జిల్లా ట్రాన్స్ ఫోర్టు అధికారి కిషన్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉన్నది మన రక్షణ కోసమే అనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు. కొద్ది దూరానికే హెల్మెట్ఎందుకనే నిర్లక్ష్యంతో తలకు గాయమై చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పాల్గొన్నారు.
