కేసీఆర్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడుతాం: కిషన్ రెడ్డి

కేసీఆర్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడుతాం: కిషన్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‭కు గట్టి పోటీ ఇచ్చామని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నైతిక విజయం సాధించిందని ఆయన చెప్పారు. ఉపఎన్నిక సయమంలో బీజేపీ పై తప్పుడు ప్రచారాలు చేసి.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ పై విమర్శలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. 

నిజమైన ఆట ఇప్పుడు మొదలైందని కిషన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కుటుంబపాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. ఆరోపించారు. కేసీఆర్‭కు రోజులు దగ్గరపడ్డాయని.. టీఆర్ఎస్‭ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.