బీజేపీ కిషన్ రెడ్డికి మాతృవియోగం

బీజేపీ కిషన్ రెడ్డికి మాతృవియోగం

రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత G.కిషన్ రెడ్డి తల్లి గంగాపురం అండాలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయస్సు 80 ఏళ్లు. అనారోగ్యంతో ఆమె కొన్నిరోజులుగా హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ లో అండాలమ్మ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు చెప్పారు. కిషన్ రెడ్డికి మాతృవియోగంపై పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.