సికింద్రాబాద్‭లో కిషన్ రెడ్డి పాదయాత్ర

సికింద్రాబాద్‭లో కిషన్ రెడ్డి పాదయాత్ర

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ అడ్డగుట్ట, తుకారం గేట్, తార్నాక, లాలపేట్, మెట్టుగూడలో కిషన్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. బస్తీవాసులను అడిగి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం బోరబండ, ఎర్రగడ్డలో ఆయన పర్యటించనున్నారు. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడమే లక్ష్యంగా కిషన్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. అడ్డగుట్టతో పాదయాత్రకు వెళ్లిన ఆయనకు.. అక్కడి ప్రజలు ఘనస్వాగతం పలికారు. 

కొందరు బస్తీవాసులు తమ సమస్యలను వివరిస్తూ కిషన్ రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. ఇక కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఇవాళ పూర్తిగా సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలోనే ఆయన పర్యటించనున్నారు. రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు.