భీమదేవరపల్లి, వెలుగు: ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో కిచెన్ షెడ్, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామ మాజీ సర్పంచ్ దూడల ప్రమీల భర్త సంపత్ బుధవారం కిచెన్ షెడ్కు తాళం వేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. 2023లో ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనుల్లో భాగంగా స్కూల్లో కిచెన్ షెడ్‌తో పాటు ఇతర పనులను రూ.6 లక్షల వ్యయంతో అప్పులు చేసి నిర్మించామని తెలిపారు. పనులకు సంబంధించిన బిల్లుల కోసం ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నానని, తాను బతికుండగానే రావాల్సిన రూ.3 లక్షల బకాయిని చెల్లించాలని కన్నీటి పర్యంతమయ్యారు.
