కిచెన్ తెలంగాణ : అటుకుల వడ

కిచెన్ తెలంగాణ : అటుకుల వడ

కావాల్సినవి : 

అటుకులు : ఒక కప్పు, 

బొంబాయి రవ్వ, పెరుగు : ఒక్కోటి అరకప్పు చొప్పున

కరివేపాకు, కొత్తిమీర : కొంచెం

అల్లం : చిన్న ముక్క

ఎండుమిర్చి తునకలు, వెల్లుల్లి తరుగు : ఒక్కో టీస్పూన్ చొప్పున

నూనె : అర టేబుల్ స్పూన్

ఉప్పు, నీళ్లు : సరిపడా

ఆవాలు, జీలకర్ర : ఒక టీస్పూన్

పచ్చి మిర్చి : రెండు

ఉల్లిగడ్డ : ఒకటి

టొమాటోలు : మూడు

పసుపు, గరం మసాలా : ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున

ధనియాల పొడి, జీలకర్ర పొడి : ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున

కారం : ఒక టీస్పూన్

తయారీ : అటుకులను కడిగి పది నిమిషాలు పక్కన పెట్టాలి. మిక్సీజార్​లో అటుకులు, బొంబాయి రవ్వ, కరివేపాకు, అల్లం, ఉప్పు వేసి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. కొత్తిమీర, ఎండుమిర్చి తునకలు వేసి బాగా కలపాలి. తర్వాత ఒక అరిటాకు లేదా కాటన్​ క్లాత్​ మీద పెట్టి వడలా వత్తాలి. వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. పాన్​లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. 

తర్వాత టొమాటో తరుగు వేయాలి. అందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కలపాలి. కొన్ని నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. చివరిగా రెడీ చేసి పెట్టుకున్న వడల్ని అందులో వేసి కలపాలి.