లక్నో వర్సెస్ కోల్కతా.. బ్యాటింగ్ చేయనున్న కృణాల్ సేన

లక్నో  వర్సెస్ కోల్కతా.. బ్యాటింగ్ చేయనున్న కృణాల్ సేన

ఐపీఎల్ 16లో ప్లేఆఫ్ రేసులో కీలక పోరు జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ లో  కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి.  ఇందులో భాగంగా టాస్ గెలిచిన కేకేఆర్..బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఇందులో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా లక్నో ప్లేఆఫ్ చేరనుండగా..భారీ తేడాతో కోల్ కతా గెలిస్తే మాత్రం ఆ జట్టు ప్లేఆఫ్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. 

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి. 

లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు:  క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్