Cricket World Cup 2023: రాహుల్ ఇంట్లో దీపావళి వేడుకలు.. సందడి చేసిన భారత క్రికెటర్లు

Cricket World Cup 2023: రాహుల్ ఇంట్లో దీపావళి వేడుకలు.. సందడి  చేసిన భారత క్రికెటర్లు

వరల్డ్ కప్ లో టీమిండియా క్రికెటర్లు రాహుల్ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అదేంటి ఎంతోమంది క్రికెటర్లు ఉంటే రాహుల్ ఇంట్లోనే ఎందుకు సంబరాలు చేసుకున్నారు అనే సందేహం చాలా మందిలో రావొచ్చు. ప్రస్తుతం భారత్ బెంగళూరులో ఉంది. ఇదే వేదికపై నెదర్లాండ్స్ తో వరల్డ్ కప్ లో తమ చివరి లీగ్ మ్యాచ్  ఆడనున్నారు. రాహుల్ జన్మస్థలం బెంగళూరు కావడంతో టీమిండియా క్రికెటర్లతో పాటు సిబ్బంది అంతా కలిసి రాహుల్ ఇంటిని వెళ్లారు.  

నేడు(నవంబర్ 12) దీపావళి కావడంతో ఇక్కడే వేడుకలు జరుపుకొని సందడి చేశారు. అందరూ సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఎంతో పద్ధతిగా ఫోటోలకు ఫోజులిచ్చారు. "మా నుండి మీ అందరికీ, దీపావళి శుభాకాంక్షలు" అని రాహుల్ సోషల్ మీడియాలో అందరికి దీపావళి  శుభాకాంక్షలు తెలియజేశాడు. భారత క్రికెటర్లు అందరూ గోల గోల చేస్తూ ఎంతో సరదాగా గడిపారు. వరల్డ్ కప్ సెమీస్ కు ముందు ఆటగాళ్లు ఇలా చిల్ అవ్వడం టీమిండియా వారిలో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. 

వరల్డ్ కప్ లో భారత్ ఇప్పటికే సెమీస్ కు చేరగా నేడు బెంగళూరు వేదికగా (నవంబర్ 12) నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా తొలి 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 36 పరుగులతో, శుభమన్ గిల్ 26 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. నవంబర్ 15 న న్యూజిలాండ్ తో భారత్ సెమీ ఫైనల్ ఆడనుంది.