IndvsAus : గెలుపే టార్గెట్..ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి:కేఎల్ రాహుల్

IndvsAus : గెలుపే టార్గెట్..ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి:కేఎల్ రాహుల్


బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టుకు పకడ్బందీగా సిద్దమవుతున్నట్లు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఈ సిరీస్ తమకు చాలా ముఖ్యమని వరల్డ్ ఛాంపియన్ షిప్లో ఫైనల్ చేరడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పాడు. ఇందులో భాగంగా ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు.  అయితే మ్యాచ్ తొలి రోజు పిచ్పై అంచనాకు వచ్చిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నాడు.  ఆస్ట్రేలియా టీమ్లో చాలా మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారని..ఇది భారత బౌలర్లకు సవాల్ అని చెప్పాడు.  అయితే సిరాజ్, అశ్విన్‌లకు లెఫ్ట్ హ్యాండర్లపై  మంచి రికార్డు ఉందన్నాడు. అయితే స్పిన్నర్ల బౌలింగ్లో లెఫ్టాండర్లు ఇబ్బంది పడతారని.. అందుకే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే యోచనలో ఉన్నామని చెప్పుకొచ్చాడు. 

ఏ త్యాగానికైనా సిద్ధం..

ఈ టెస్టు సిరీస్లో తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమని కేఎల్ రాహుల్ తెలిపాడు. జట్టు అవసరం కోసం మిడిలార్డర్‌లోనైనా బ్యాటింగ్ చేస్తానన్నాడు.  ఇంకా తొలి టెస్టు ఆడే తుది జట్టును నిర్ణయించలేదన్నాడు. అయితే టీమ్‌లో కొన్ని ఖాళీలను భర్తీ చేయాలన్నాడు. ఈ టెస్టు సిరీస్లో తాను ఓపెనింగే చేస్తానని అనుకోవడం లేదన్నాడు. టీమ్ ఆదేశిస్తే..తాను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేందుకైనా రెడీ అన్నాడు.