మహబూబ్ నగర్ :కేఎల్‌‌‌‌‌‌‌‌ఐ పంపులు 24 గంటలు నడపాలి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

 మహబూబ్ నగర్ :కేఎల్‌‌‌‌‌‌‌‌ఐ పంపులు 24 గంటలు నడపాలి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

వనపర్తి, వెలుగు/నాగర్​కర్నూల్​ : శ్రీశైలం జలాశయంలో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం రేవల్లి మండలం గౌరీదేవిపల్లి వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌‌‌‌‌‌‌‌ఐ) స్టేజ్-3 పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ను మాజీ మంత్రులు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, హర్షవర్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కేఎల్‌‌‌‌‌‌‌‌ఐ పంపులను పూర్తిస్థాయిలో నడపడం లేదని ఆరోపించారు. 

ఏపీ నీటిని తరలించుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేఎల్‌‌‌‌‌‌‌‌ఐ పంపులకు 24 గంటల నిరంతర విద్యుత్‌‌‌‌‌‌‌‌సరఫరా చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్ మాట్లాడుతూ విద్యుత్‌‌‌‌‌‌‌‌సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల పంపులు పనిచేయడం లేదని ఆరోపించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించే వరకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌అండగా ఉంటుందని తెలిపారు.