డాక్టర్ ప్రీతి కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ

డాక్టర్ ప్రీతి కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ

కేఎంసీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి మృతి నిర్ధారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిందితుడు డాక్టర్ సైఫ్ ను మూడు రోజులుగా విచారిస్తున్నారు. శుక్రవారం ( రెండో రోజు ) అర్థరాత్రి 2 గంటల వరకూ పోలీస్ కమిషనర్, మరికొందరు ఉన్నతాధికారుల సమక్ష్యంలో విచారణ కొనసాగింది. రేపటితో  సైఫ్ పోలీస్ కస్టడీ ముగియనుంది. కాగా, ప్రీతి చనిపోవడానికి సంబంధించిన నిర్ధారణ వ్యవహారంలో ఫోరెన్సిక్ నివేదిక పైనే ఆధారపడివుంది. ఫోరెన్సిక్ నివేదిక రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ ల్యాబ్, గాంధీ ఆస్పత్రి నుంచి వరంగల్ పోలీసులకు నివేదికలు ఇంకా అందలేదు. మొత్తం 44 చాట్స్ కు సంబంధించిన సాంకేతిక ఆధారాలపై పోలీసులు అవగాహనకు వచ్చినట్లు సమాచారు. పోలీసులు విచారణ వివరాలను పోల్చుకుంటూ మరో సారి సీన్ రీ చెక్ చేస్తున్నారు. డాక్టర్ సైఫ్ పారిపోవడానికి ఎందుకు ప్రయత్నించాడనే దానిపై ఆరా తీస్తున్నారు. సైఫ్ కు సహకరించిన వారి వివరాలను కూడా చార్జీషీట్ లో పొందు పరుచే అవకాశం ఉంది.  ఖచ్చితంగా హత్యే నని డాక్టర్ ప్రీతి బంధువులు వాదిస్తుండటంతో లోతుగా పోలీసులు విచారిస్తున్నారు. సైఫ్ నుంచి రాబట్టిన వివరాలకు సంబంధించి కేఎంసీ అధికారులతో పోలీసులు మరోసారి భేటీ కానున్నారు.

కేఎంసీ ప్రిన్సిపల్ నుంచి నిందితుడు డాక్టర్ సైఫ్, మ్రుతురాలు డాక్టర్ ప్రీతికి సంబంధిచిన లిఖిత పూర్వక వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో సైఫ్ వ్యక్తిగత డాటాను అనాలిసిస్ చేస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో నిందితుడు సైఫ్ సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడని తెలుస్తోంది. సైఫ్ మొబైల్ ఫోన్ లో కీలక ఆధారాలు లభించాయి. అతనికి చెందిన VO-1907 స్కై బ్లూ బ్లూ ఫోన్ లో కీలక సాక్ష్యాలు ఉన్నాయిని తెలుస్తోంది. మొబైల్ నుంచి కేసులో కీలకమైన మొత్తం 17 చాట్స్ ను స్వాధీనం చేసుకుని విచారణాధికారి సరిపోల్చుతున్నాడు. ప్రీతి ఆత్మహత్యాయత్నం సమాచారం తెలుసుకుని సైఫ్ పారి పోయేందుకు ప్రయత్నించాడు.  ఘటన జరిగిన రోజు పారి పోయేందుకు స్కెచ్ తోనే కేఎంసీ నుంచి బయటకు వచ్చాడు.  హైదరాబాద్ కు పారి పోయేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. సైఫ్  వరంగల్  రైల్వే స్టేషన్ కు పోతున్న క్రమంలో మట్టెవాడ పోలీసులు  సమాచారం అందుకున్నారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ వద్ద సైఫ్ ను పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. 

 డాక్టర్ ప్రీతిని టార్గెట్ చేయాలని తన సీనియర్ డాక్టర్ భార్గవ్ ను నిందితుడు సైఫ్ కోరినట్లు తెలుస్తోంది.  ప్రీతిని టార్గెట్ చేయాలనే కోణంలో మరో కొత్త వ్యక్తిని సైఫ్ కోరినట్టు విచారణలో వెలుగు చూస్తున్నాయి.  తన సహచర విద్యార్థిని మరో డాక్టర్ తో ప్రీతికి రెస్ట్ లెస్ గా డ్యూటీస్ వేయాలని నిందితుడు సైఫ్ కోరాడు. ఈ విచారణలో డాక్టర్ అనుష తో 8 చాట్స్, డాక్టర్ బార్గవి మేడం నుంచి 6 చాట్స్, నిందితుడు సైఫ్ నుంచి 3 చాట్స్ ను పోలీసులు సరి పోల్చుతున్నారు.  పీఏసీ రిపోర్ట్ సహా, డాక్టర్ ప్రీతి ఎండీ కోర్సుకు పనికి రాదు అనే డాక్టర్ సైఫ్ బావనను ధ్రువీకరించే అన్ని సాక్షాలను రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. మొబైల్ టెక్నిషియన్ మిలాన్ కుమార్ సహాయంతో డాటా అనాలసిస్ చేస్తున్నారు. పీఏసీ రిపోర్ట్ విషయంలో డాక్టర్ ప్రీతిని హేళన చేసినట్టు, కాల్స్, మెసేజ్ లు డాక్టర్ సైఫ్ ఫోన్ డాటా నుంచి అనాల్సిస్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.