O-1 visa: లక్కుతో వచ్చే హెచ్1బి వీసా మిస్ అయ్యింది.. టాలెంట్ తో O-1 వీసా కొట్టాడు బెంగళూరు టెక్కీ.. ఎలా అంటే..?

O-1 visa: లక్కుతో వచ్చే హెచ్1బి వీసా మిస్ అయ్యింది.. టాలెంట్ తో O-1 వీసా కొట్టాడు బెంగళూరు టెక్కీ.. ఎలా అంటే..?

అమెరికాలో పనిచేస్తున్న బెంగళూరు టెక్కీ తన ఉద్యోగ ప్రవాసయాత్రలో హెచ్1బి వీసా లాటరీ మూడు సార్లు మిస్ అయ్యిందని కానీ తన లక్ష్యాన్ని ఆదని టెక్ ప్రొఫెషనల్ చెప్పాడు. తను ప్రతిభను చూపించడంతో అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఐన్‌స్టీన్ O-1 వీసాను దక్కించుకున్నట్లు పంచుకున్నాడు. ఏఐ రంగంలో తన ప్రతిభను చూపటం వల్లనే తనకు ఈ ప్రత్యేక వీసా లభించిందని చెప్పాడు. 

బెంగళూరులో జన్మించిన తణుష్ శరణార్థి.. IBM కంపెనీ కాలిఫోర్నియాలో పని చేస్తున్నారు. ఆయన మూడు సంవత్సరాలుగా హెచ్1బి వీసా కోసం ప్రయత్నించాడు కానీ ప్రతి సారి కూడా లాటరీ విధానంలో ఎంపిక కాలేకపోయాడు. అయితే “వీసా గేమ్ ఆఫ్ ఛాన్స్” అంటూ లక్ కోసం వేచి ఉండకుండా తన ప్రతిభను పెంచుకుంటూ పనిలో మునిగిపోయారు. రాత్రింబవళ్లు కష్టపడి రీసెర్చ్ చేయడం, ప్రొడక్టులు అభివృద్ధి చేయడం, కమ్యూనిటీకి కాంట్రిబ్యూట్ చేయడం, పబ్లికేషన్లు చేయడంతో తన డొమైన్‌లో ఉత్తమ స్థాయిలకు చేరుకున్నాడు. 

O-1 వీసా ఎలా వచ్చింది..?
O-1 వీసా పొందేందుకు కనీసం 8 ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మూడింటిని వ్యక్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. శరణార్థి ఇప్పటికే ఉన్న రీసెర్చ్ పబ్లికేషన్లు, హాకథాన్లలో జడ్జిగా వ్యవహరించడం, ఇతర కాన్ఫరెన్సులకు పేపర్లు రివ్యూ చేయడం ద్వారా దాదాపు ఆ ప్రామాణికల్లో రెండింటిని కలిగి ఉన్నాడు. అలా తన నైపుణ్యాలే ప్రత్యేక వీసాను తెచ్చిపెట్టాయని చెప్పాడు టెక్కీ. వీసా కోసం పనికే పరిమితమవద్దు, మీ ఫీల్డ్‌కి నిజంగా కంట్రిబ్యూట్ చేయాయని చెపుతున్నాడు బెంగళూరు టెక్కీ. పదేపదే ప్రయత్నించడం, కృషి, నెట్‌వర్కింగ్, స్కిల్ పబ్లిసిటీ అక్కరకు వస్తాయని చెప్పాడు. అలాగే సిలికాన్ వ్యాలీ వంటి వాతావరణంలో ఇతర నిపుణులతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా అవసరమని సూచిస్తున్నాడు. 

మెుత్తానికి లాటరీని నమ్ముకోవటం కంటే చేసే పనిలో కంటిసిటెన్సీకి విలువ ఎక్కువగా ఉంటుందని తణుష్ చెబుతున్నారు. ప్రతిభ, పట్టుదల ఉంటే మాత్రమే O-1 వంటి ప్రతిష్టాత్మక వీసా పొందటం అమెరికాలో సాధ్యం అవుతుందని ఈ స్టోరీ ద్వారా స్పష్టమవుతోంది. ట్రంప్ కూడా ఫీజు పెంపుతో ఇలాంటి టాలెంటెడ్ టెక్ రిసోర్సెస్ అమెరికాకు రాకుండా ఆపలేరని నిపుణులు అంటున్నారు.