30 ఏళ్ల పాటు రోజూ రూ.100 SIP Vs 15 ఏళ్ల పాటు రోజూ రూ.500 SIP పెట్టుబడి, ఎక్కడ ఎంత రాబడంటే?

30 ఏళ్ల పాటు రోజూ రూ.100 SIP Vs 15 ఏళ్ల పాటు రోజూ రూ.500 SIP పెట్టుబడి, ఎక్కడ ఎంత రాబడంటే?

ఇటీవలి కాలంలో ప్రజల్లో పెరుగుతున్న ఆర్థిక అవగాహనతో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ బాట పడుతున్నారు. దీనికి తోడు అనేక సంస్థలు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను రోజువారీ, నెలవారీ, ఏడాదికి అలాగే వారం వారీ పెట్టుబడులకు అనుమతి కల్పిస్తూ ఎస్ఐపీలకు అవకాశం కల్పించటంతో చాలా మంది ఆ అవకాశాలను వినియోగించుకుంటున్నారు. కనీసం రూ.10 నుంచి పెట్టుబడికి అవకాశం రావటం కూడా చాలా మందిని ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రేరేపిస్తోంది.

అయితే రోజూ రూ.100 చొప్పున 30 ఏళ్ల పాటు దాచుకోవటం అలాగే రోజుకు రూ.500 చొప్పున మ్యూచువల్ ఫండ్ స్కీములో 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టడం పనితీరును గమనిస్తే ఎందులో ఎక్కువ రాబడి దక్కుతుందనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. మీరు రోజువారీ ఎస్ఐపీని ప్రారంభిస్తే ఏడాదిలో 365 రోజులూ పెట్టుబడి పెట్టగలరు. కానీ దీని అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి.. ఎంత కడితే చివరికి ఎంత దక్కుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ALSO READ : ఆదాయం సరిపోవట్లేదు.. ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్ల సమ్మె: మొత్తుకుంటున్న ప్రయాణికులు..

ముందుగా రోజూ 100 రూపాయల చొప్పున 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే మనం పెట్టుబడి రూపంలో రూ.10లక్షల 95వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మెుత్తం కాలంలో. ఇక్కడ 12 శాతం సగటు వార్షిక రాబడిని పరిగణలోకి తీసుకుంటే చివరికి పెట్టుబడిదారులు రూ.93లక్షల 28వేల 629 రాబడిని అందుకుంటారు. అలాగే రోజూ రూ.500 చొప్పున 15 ఏళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే.. ఈ కాలంలో రూ.27లక్షల 37వేల 500 ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనిపై చివరికి రూ.72లక్షల 05వేల 170 రాబడిగా పొందుతారు. దీనిని బట్టి దీర్ఘకాలంలో చిన్న మెుత్తాలు పెట్టుబడిగా పెట్టే వారు మంచి కార్పస్ అందుకుంటారని తెలుస్తోంది.