
క్యాబ్ సర్వీసులు అందించే ఉబెర్, ఓలా, రాపిడో డ్రైవర్లు జూలై 15 నుండి సేవలు నిలిపివేయడంతో ముంబై అంతట ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నిరసన ఎందుకంటే ఎయిర్ పోర్ట్ జోన్, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, అంధేరి, సౌత్ ముంబైతో సహా ప్రముఖ ప్రాంతాల్లో డ్రైవర్ల తక్కువ ఆదాయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగేటర్ కమీషన్లు, పెట్రోల్ ఖర్చులు తీసేసిన తర్వాత డ్రైవర్ల ఆదాయం కొన్నిసార్లు కిలోమీటరుకు కేవలం రూ.8 నుండి రూ.12కి పడిపోతుందని ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు, బండి మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతుండటంతో ఆదాయం సరిపొవట్లేదని డ్రైవర్లు మొత్తుకుంటున్నారు. డ్రైవర్ల ప్రయోజనాలను కాపాడుకోవడానికి సరైన రెగ్యూలేటరీ లేకపోవడం వల్ల వీరి నిరాశ మరింత పెరిగింది.
డ్రైవర్ల డిమాండ్లు ఏంటంటే : ఈ సమ్మె మహారాష్ట్ర గిగ్ కామ్‌గర్ మంచ్, మహారాష్ట్ర రాజ్య రాష్ట్రీయ కామ్‌గర్ సంఘ్, ఇండియన్ గిగ్ వర్కర్స్ ఫ్రంట్ వంటి సంస్థలు కలిసి చేస్తున్నాయి. క్యాబ్ ఛార్జీలను నలుపు-పసుపు రంగు టాక్సీలతో సమానంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బైక్ టాక్సీలను నిషేధించాలని, కాలి-పీలీ క్యాబ్‌లు ఇంకా ఆటోలకు కొత్త పర్మిట్లపై పరిమితి విధించాలని, యాప్ డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారి హక్కులను కాపాడటానికి మహారాష్ట్ర గిగ్ వర్కర్స్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ప్రతి రైడ్ పై యాప్స్ అందించే డిస్కౌంట్‌ల పై కూడా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ALSO READ : క్షమాపణ చెప్పండి: వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్‌కు భారత పైలట్ల సంఘం లీగల్ నోటీస్
ప్రయాణికుల ఇబ్బందులు : క్యాబ్‌లు రోడ్డుపైకి రాకపోవడంతో ప్రతిరోజు క్యాబ్లో ప్రయాణం చేసే వారు, ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ వెళ్లే వారికీ కష్టంగా మారింది. దీనిపై ముంబై విమానాశ్రయం సోషల్ మీడియాలో ఒక సలహా జారీ చేస్తూ క్యాబ్ డ్రైవర్ల నిరసనల కారణంగా ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించింది. సమాచారం ప్రకారం, సమ్మె చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లను జూలై 18న రవాణా శాఖ అధికారులు చర్చల కోసం జూలై 22 వరకు చూసి తరువాత ఎం చేయాలో నిర్ణయించుకోవాలని చెప్పారు.
In light of ongoing protests in the state, passengers travelling via #MumbaiAirport are advised to check transport availability and plan alternate arrangements in advance.#CSMIA #PassengerAdvisory #Travel #Aviation pic.twitter.com/UnWScJue6U
— Mumbai Airport (@CSMIA_Official) July 16, 2025