June 1st Rules: జూన్ 1 నుంచి మారుతున్న 10 రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం

June 1st Rules: జూన్ 1 నుంచి మారుతున్న 10 రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం

Rules Changing From June 1st: ప్రతి నెల మాదిరిగానే కొత్తనెల ప్రారంభం నుంచి కూడా అనేక అంశాలు మారిపోతున్నాయి. గ్యాస్ ధరల నుంచి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకు వస్తున్న మార్పులు ఆర్థికంగా సామాన్యుల జోబులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాలను తప్పక తెలుసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో వస్తున్న 10 కీలకమైన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. జూన్ 1 నుండి EPFO తన​3.0 కొత్త వెర్షన్‌ను ప్రారంభిస్తోంది. దీందో పీఎఫ్ సొమ్ము విత్ డ్రా, కేవైసీ అప్ డేషన్, క్లెయిమ్ ప్రక్రియ గతంలో కంటే వేగంగా.. సులభంగా మారనుంది. ప్రత్యేకత ఏమిటంటే EPF సంబంధిత కార్డులను ATM కార్డుల మాదిరిగానే ఉపయోగించవచ్చని తెలుస్తోంది.

2. జూన్‌లో బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను మార్చవచ్చు. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించే అవకాశం ఉన్నందున ఎఫ్‌డి రేట్లు తగ్గవచ్చు. దీంతో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సైతం గతంలో అందిస్తున్నదాని కంటే తక్కువ వడ్డీరేటును ఆఫర్ చేసే అవకాశం ఉంది.

Also Read : తగ్గనున్న వంటనూనెల ధరలు

3. జూన్ నెల ప్రారంభం నుంచి కోటక్ మహీంద్రా బ్యాంక్ సహా ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డ్ నియమాల్లో మార్పులు వస్తాయి. రివార్డ్ పాయింట్ల పరిమితులను సంస్థలు మార్చవచ్చు. అలాగే ఆటో-డెబిట్ ఫెయిల్ అయితే జరిమానాలు విధించవచ్చు. అలాగే సదరు కార్డుల ద్వారా వినియోగదారులు చేసే ఇంధనం/యుటిలిటీ చెల్లింపులపై అదనపు ఛార్జీలను విధించవచ్చు.

4. ప్రతి నెలా మొదటి తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు మార్పులు చేస్తుంటాయి. దీని ఫలితంగా జూన్ 1న గృహ- వాణిజ్య గ్యాస్ ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

5. జూన్ నెల నుంచి ఏటీఎం ద్వారా మనీ విత్ డ్రా విషయంలో ఉచిత లావాదేవీల పరిమితి తర్వాత చేసే ట్రాన్సాక్షన్లపై విధించే ఛార్జీలు పెరగవచ్చు. ఎక్కువగా నగదు ఉపసంహరించుకునే వ్యక్తులు ఈ మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.

6. మ్యూచువల్ ఫండ్ పథకాలకు సెబీ కొత్త కటాఫ్ సమయాన్ని ప్రవేశపెట్టింది. జూన్ 1 నుంచి ఆఫ్‌లైన్ లావాదేవీల సమయం మధ్యాహ్నం 3 గంటలు అలాగే ఆన్‌లైన్ లావాదేవీలకు సాయంత్రం 7 గంటలుగా నిర్ణయించింది. దీని తరువాత చేసిన ఆర్డర్లు తదువాతి పని దినాన పరిగణించబడతాయని స్పష్టం చేసింది. 

7. ఆధార్ కార్డుల ఫ్రీ అప్‌డేట్ సౌకర్యం 14 జూన్ 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వినియోగదారులు గమనించాలి. దీని తర్వాత ఆన్‌లైన్ నవీకరణకు రూ.25, అలాగే సేవా కేంద్రంలో రూ.50 రుసుము వసూలు చేయబడుతుంది. అడ్రస్ మార్పులు ఏవైనా చేసుకోవాలంటే వెంటనే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. 

8. NPCI ఒక కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అమలులోకి వస్తున్నాయి. దీని ప్రకారం UPI చెల్లింపు చేస్తున్నప్పుడు, వినియోగదారుడు 'అల్టిమేట్ బెనిఫిషియరీ' అంటే నిజమైన రిసీవర్ బ్యాంకింగ్ పేరును మాత్రమే చూడగలరు. QR కోడ్ లేదా సవరించిన పేరు ఇకపై కనిపించదు. అన్ని UPI యాప్‌లు జూన్ 30 నాటికి ఈ నియమాలను అమలు చేయాల్సి ఉంది. 

9. రిజర్వు బ్యాంక్ అధికారిక సెలవుల క్యాలెండర్ ప్రకారం జూన్ మాసంలో దేశంలోని బ్యాంకులు మెుత్తంగా 12 రోజుల పాటు సెలవులో ఉండనున్నాయి. ఇందులో ఆదివారం, రెండవ- నాల్గవ శనివారాలు కూడా కలిపి ఉంటాయి. ఈనెలలో బక్రీద్ వంటి పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నందున బ్యాంకులో ఏదైనా పని ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవటం ఉత్తమం.

10. కొన్ని బ్యాంకులు జూన్ నుండి క్రెడిట్ కార్డులను ఉపయోగించి విద్యుత్, నీరు మొదలైన యుటిలిటీ బిల్లులను చెల్లించడంపై అదనపు ఛార్జీలు విధించవచ్చని లేదా క్యాష్‌బ్యాక్ నిబంధనల మార్పులకు దిగుతున్నాయి.