ప్రస్తుతం మారుతున్న మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ పోర్ట్ ఫోలియోలో బంగారం, వెండికి చోటు కల్పించాల్సిందే. ఎందుకంటే ఈ లోహాలు మంచి వ్యూహాత్మక ఆస్తులుగా నిలవటమే కారణం. బంగారం మధ్య-దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియోలకు విశ్వసనీయ పెట్టుబడిగా.., ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి, జియోపొలిటికల్ ఉద్రిక్తతల సమయంలో రక్షణగా పరిగణించబడుతోంది.
ఇప్పటికే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటే వాటిని కొనసాగించాలని ప్రముఖ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. కొత్త పెట్టుబడిదారులు చిన్న SIPల ద్వారా క్రమంగా వీటిలో ఇన్వెస్ట్ చేయాలని సూచించింది. వాల్యూకర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పార్టనర్ రొనక్ మోర్జేరియా చిన్న SIPలతో 5-7 సంవత్సరాల్లో మంచి కార్పస్ నిర్మించవచ్చని అన్నారు. పెట్టుబడిదారులు మత ఆదాయంలో 10 శాతానికి మించకుండా బంగారంపై పెట్టుబడి పెట్టాలని పేర్కొన్నారు.
వెండిలో పెట్టుబడులకు కూడా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ.. ఎక్కువ రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్లకు మాత్రమే ఇది సెట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వెండి ధరల్లో కొనసాగుతున్న ఓలటాలిటీ వల్ల ఇన్వెస్టర్లు భారీ నష్టాలను కూడా పొందే ప్రమాదం ఉంటుందని వారు చెబుతున్నారు. అందువల్ల బంగారం, వెండిలో 10 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయెుద్దని సూచిస్తున్నారు. దీన్ని పోర్ట్ ఫోలియోలో పెట్టుబడి విభజన, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం ఉపయోగించాలని సూచిస్తున్నారు.
గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ 5 మాటల్లో ఇలా..
1. బంగారం పెట్టుబడులు కొనసాగించటం లేదా నెమ్మదిగా పోగుచేసుకోవటం మంచిది.
2. ఎల్లప్పుడు దీర్ఘకాలిక వ్యూహంతోనే చిన్న పెట్టుబడులను స్టార్ట్ చేయండి.
3. వెండి ఓలటాలిటీ కారణంగా ఎక్కువ రిస్క్ తీసుకోగలిగితేనే దాని జోలికి వెళ్లండి.
4. వెండి విషయంలో బంగారం కంటే తక్కువ పెట్టుబడి కలిగి ఉండటం బెటర్
5. మెుత్తం మీద మీ పెట్టుబడుల్లో 10 శాతానికి మించి ఈ రెండింటిలో దాటకుండా చూసుకోండి.
