బోల్తా కొట్టిన బిట్‌కాయిన్.. ఇన్వెస్టర్లలో షెన్షన్, ఏం జరుగుతోంది క్రిప్టోలకు..?

బోల్తా కొట్టిన బిట్‌కాయిన్.. ఇన్వెస్టర్లలో షెన్షన్, ఏం జరుగుతోంది క్రిప్టోలకు..?

ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయటానికి ఆసక్తి చూపుతున్న పెట్టుబడి సాధనంగా క్రిప్టోలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తక్కువ కాలంలోనే వాటి నుంచి వచ్చిన అధిక రాబడులే వాటికి ఆ క్రేజ్ తెప్పించాయి. అయితే ప్రస్తుతం పెద్దపెద్ద ఇన్వెస్టర్లు వీటికి దూరంగా జరుగుతుండటం బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోల పతనానికి దారితీస్తోంది. నేడు ప్రస్తుతం బిట్‌కాయిన్ కొద్ది రోజుల కిందట ఉన్న ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి తగ్గుతూ ధర 6 నెలల కనిష్టాలకు చేరుకుంది. 

దీంతో శుక్రవారం రోజున ఒక్కో  బిట్‌కాయిన్ రేటు 86వేల డాలర్ల స్థాయికి దగజారింది. అయితే గత ఏడాది ఏప్రిల్ నెలలో ఉన్న 85,629.31 డాలర్ల స్థాయికి ప్రస్తుతం రేటు దగ్గరగా చేరుకోవటం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే అనూహ్యంగా క్రిప్టోలు పతనం దిశగా ప్రయాణించటానికి కారణాలు ఏంటి అనే ప్రశ్న భారతదేశంలోని ప్రతి పెట్టుబడిదారుడి మదిలో కొనసాగుతోంది. 

క్రిప్టో కరెన్సీల పతనానికి కీలక కారణాలు..

1. అమెరికా జాబ్ డేటా బలంగా ఉండటం. సెప్టెంబర్ నెలలో అమెరికాలో కొత్తగా లక్షా 19వేల ఉద్యోగాల కల్పన నిపుణులు అంచనా వేసిన దానికంటే డబుల్ కంటే ఎక్కువగా ఉండటం. దీంతో రానున్న ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపులపై పెట్టుబడిదారులు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులు స్పెకులేటివ్ ఆస్తులపై ఒత్తిడిని కలిగిస్తోంది. 

2. ఏఐ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న క్రమంలో టెక్ దిగ్గజం ఎన్వీడియా బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేయటం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్లను బలోపేతం చేస్తూ వారిని టెక్ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టే దిశగా నడిపిస్తున్నాయి. ఏఐ స్టాక్స్ కలిగిన క్రిప్టో ఇన్వెస్టర్ల సెంటిమెంటల్ ట్రేడింగ్ కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. 

3.  దీనికి తోడు అక్టోబరు 2025 ప్రారంభం నుంచి క్రిప్టో మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో కొనసాగటం కూడా మరో కారణంగా నిపుణులు అంటున్నారు. దీంతో అత్యధిక ర్యాలీ తర్వాత చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం లిక్విడేషన్ చేసేలా ప్రేరేపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 

మెుత్తానికి సుదీర్ఘంగా కొనసాగిన క్రిప్టో బుల్ ర్యాలీకి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. క్రిప్టోల పనితీరు, వాటి హెచ్చుతగ్గులకు కారణాలు వంటి వివరాలపై జ్ఞానం లేకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల ఇన్వెస్టర్లు బోల్తా కొట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి పెట్టుబడికీ రిస్క్ ఉంటుందని దానిని సరిగ్గా అర్థం చేసుకుని ముందుకెళ్లటం కీలకం అంటున్నారు. ఎప్పుడూ బుల్ ర్యాలీనే ఉండాలనుకోవటం సరైనది కాదని చెబుతున్నారు.