కొచ్చి మెట్రో గుడ్ న్యూస్.. రైళ్లలో సైకిళ్లను ఫ్రీగా తీసుకెళ్లొచ్చు

కొచ్చి మెట్రో గుడ్ న్యూస్.. రైళ్లలో సైకిళ్లను ఫ్రీగా తీసుకెళ్లొచ్చు

కొచ్చి (కేరళ): కొచ్చి మెట్రో రైలు అధికారులు ప్రయాణికులకు శుభవార్త ప్రకటించారు. ప్రయాణికులు తమ వెంట సైకిళ్లను కూడా ఉచితంగా తీసుకెళ్లే అవకాశం కల్పించారు. తొలిదశలో ఆరు స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఈ సేవలను ప్రారంభించిన అధికారులు.. ప్రయాణికుల స్పందనను బట్టి అన్ని మెట్రో స్టేషన్లలో ఈ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించారు.

కరోనా నేపధ్యంలో ఆరోగ్యం.. వ్యాయామం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలుసు… ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి తాము మెట్రో రైలులో సైకిళ్లను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతించాలని నిర్ణయించామని కొచ్చి మెట్రో అదనపు చీఫ్ సెక్రటరీ అల్కేష్ కుమార్ శర్మ తెలిపారు. ఇది ప్రజలు తమ రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో సైకిళ్ల వినియోగాన్ని పెంచుకునేందుకు తమ నిర్ణయం మరింత ప్రోత్సాహం ఇస్తుందని  పేర్కొన్నారు. ఇప్పటికే కొచ్చి నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో సైకిల్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. దీన్ని గుర్తించిన మెట్రో రైల్వే.. ప్రయాణికులు తమ వెంట  సైకిల్ ను మెట్రోలో ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతించాలని నిర్ణయించింది. మొదట ప్రయోగాత్మకంగా చంగంపూజ పార్క్, పాలరివట్టం, టౌన్ హాల్, ఎర్నాకుళం సౌత్, మహారాజా కాలేజ్ మరియు ఏలంకుళం తదితర ఆరు మెట్రో స్టేషన్ల లో సైకిళ్లను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతిచ్చారు. ప్రయాణికుల నుండి వచ్చే స్పందనను బట్టి మిగిలిన అన్ని స్టేషన్లకు ఈ సేవలను విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. మెట్రోలో ప్రారంభం నుండి చివరి  స్టేషన్ వరకు  ప్రయాణికులకు ఈ అవకాశాన్ని కల్పించాలని యోచిస్తున్నామని వారు స్పష్టం చేశారు.

Read more news

మనస్పర్థలతో ఫ్రెండ్స్ మధ్య గ్యాప్.. ఈ గ్యాప్ రావొద్దంటే..

సినిమాల్లోనే విలన్.. రియల్ లైఫ్‌లో మాస్ హీరో

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

మొదలైన వింటర్ క్రైసిస్.. పెరుగుతున్న కరోనా కేసులు