పేదల సంక్షేమానికి ప్రభుత్వంకృషి : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

పేదల సంక్షేమానికి  ప్రభుత్వంకృషి : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ, వెలుగు:  రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం ఆమె పట్టణంలో  నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో  పాల్గొన్నారు.  కోదాడ మండలం తొగర్రాయిలో ఆమె  గృహజ్యోతి లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి, మహాలక్ష్మి, సన్న బియ్యం పథకంతో పేదవాళ్లకు లబ్ధికలుగుతోందన్నారు.

 అనంతరం ఆమె కోదాడలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆపద సమయంలో మెరుగైన చికిత్స పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు అండగా ఉంటుందని ఆమె అన్నారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.