కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో చెన్నై షాపింగ్ మాల్ 37వ బ్రాంచ్ శనివారం ప్రారంభమైంది. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి షాపింగ్ మాల్‌ను ప్రారంభించగా, సినీ నటి రితికా నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మకాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రితికా నాయక్ మాట్లాడుతూ.. చెన్నై షాపింగ్ మాల్‌లో అన్ని వర్గాల వారికి అవసరమైన వస్త్రాలు వివిధ రకాల డిజైన్లలో తక్కువ ధరలకు లభిస్తాయని తెలిపారు. చెన్నై షాపింగ్ మాల్ రాష్ట్రంలో మరిన్ని బ్రాంచ్‌లతో విస్తరించాలని ఎమ్మెల్యే పద్మావతి ఆకాంక్షించారు.
రితికా నాయక్ ను చూసేందుకు, ఆమెతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. పలు పాటలకు డ్యాన్స్‌లతో ఆమె అభిమానులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ యెర్నేని కుసుమ, వైస్ చైర్‌పర్సన్ మల్లీశ్వరి, కౌన్సిలర్ కొల్ల కోటిరెడ్డి, పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, షాపింగ్ మాల్ నిర్వాహకులు మర్రి వెంకటరెడ్డి తదితరులు
పాల్గొన్నారు.
