నన్ను అవమానిస్తున్నారని కంటతడిపెట్టిన శిరీష

నన్ను అవమానిస్తున్నారని కంటతడిపెట్టిన శిరీష

కోదాడ, వెలుగు : తన పార్టీ వారే తనను అవమానిస్తున్నారని, అయినా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​పట్టించుకోవడం లేదని సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్​చైర్​పర్సన్​వనపర్తి శిరీష ఆదివారం కంటతడి పెట్టారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో జెండావిష్కరణ సందర్భంగా, తర్వాత గాంధీపార్కులో చోటు చేసుకున్న పరిణామాలపై కలత చెందారు. తన నివాసంలో ప్రెస్​మీట్​పెట్టి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే మల్లయ్య ముందు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమిటీ కార్యాలయంలో, తర్వాత మున్సిపాలిటీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ చేయాల్సి ఉండె . కానీ మార్కెట్​కమిటీ ఆఫీసు నుంచి సరాసరి ఆర్డీఓ ఆఫీసుకు వెళ్లిపోయారు. దీంతో టైం మించిపోతుందని చైర్​పర్సన్​ శిరీష జెండా ఆవిష్కరించారు. తర్వాత మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గాంధీపార్కులోని లైబ్రరీలో నిర్వహించే జెండావిష్కరణకు వెళ్లారు.

ఎమ్మెల్యే అక్కడికి రాగా ​తాను ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా కోదాడ ఎంపీపీ చింతా కవిత, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమిటీ చైర్ పర్సన్​బుర్రా సుధారాణి తోసివేశారని శిరీష ఆరోపించారు. దీంతో గాంధీ విగ్రహం దగ్గర మౌనదీక్ష చేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు. తాను అధికార పార్టీలో ఉన్నా అవమానాలను ఎదుర్కొంటున్నానని, తనపై, తన భర్తపై పార్టీకి చెందిన అధికార, అనధికార లీడర్లు కక్ష సాధిస్తున్నారన్నారు. అయినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.