రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తెచ్చినవ్.. కిషన్ రెడ్డిపై కోదండ రెడ్డి ఫైర్

రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తెచ్చినవ్.. కిషన్ రెడ్డిపై కోదండ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు :  కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కిషన్‌‌ రెడ్డి ఏం తెచ్చారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు ఏర్పడినప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదన్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కరువు సాయం తీసుకురాలేదన్నారు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరువుపై కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని విమర్శించారు. ప్రధాని మోదీకి సైతం లేఖ రాయలేదని మండిపడ్డారు.