
జేబీఎస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులకు మద్దతుగా వచ్చిన కోదండరాం, ఎల్.రమణ, రావుల, మోత్కుపల్లిని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డారు కోదండరామ్. శాంతి యుతంగా బంద్ లో పాల్గొంటే అరెస్టులు ఎందుకన్నారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు చెప్పినట్లు కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కోదండరాం డిమాండ్ చేశారు. అప్రకటిత ఎమర్జెన్సీ కనిపిస్తోందని ఫైర్ అయ్యారు ఎల్.రమణ