
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు అఖిల పక్ష నేతలు. మున్సిపల్ ఎన్నికలపై తొందర వద్దని వినతి పత్రం సమర్పించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం హైకోర్టు ఐదు నెలల గడువు ఇచ్చినా…రాష్ట్ర ప్రభుత్వం తొందర పడుతుందని చెప్పారు. హడావుడి ఏర్పాట్ల వల్ల వార్డుల విభజన, రిజర్వేషన్లలో అవకతవకలు జరిగాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా కూడా తప్పుల తడకగా ఉందని కమిషనర్ కు చెప్పారు అఖిల పక్ష నేతలు. అక్రమాలు సరి చేశాకే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.