కేసీఆర్​ పతనం తప్పదు: కోదండరామ్​

కేసీఆర్​ పతనం తప్పదు: కోదండరామ్​

హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని, ఎన్నికలతో సంబంధం లేకుండా గ్రూప్1 ప్రిలిమ్స్ నిర్వహించాలని ఆల్ పార్టీ నేతలు ఇచ్చిన సడక్ బంద్ ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సోమవారం ఉదయం 6 నుంచే తార్నాక లోని ప్రొఫెసర్ కోదండరామ్ బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంద్​లో పాల్గొనటానికి వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కోదండరామ్​ ఇంటికి చేరుకోగా ఎవరినీ పోలీసులు అనుమతించలేదు. 

ఈ సందర్భంగా కోదండరామ్.. మాట్లాడుతూ అసమర్థ సీఎం కేసీఆర్ వల్లే రాష్ర్టంలో నిరుద్యోగులకు ఈ పరిస్థితి దాపురించిందని, చేతగాక పోతే కేసీఆర్ దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్​ పతనం తప్పదని హెచ్చరించారు. ఒక్క ఉద్యోగ పరీక్షను సక్రమంగా నిర్వహించలేని బోర్డును రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.