అందరం కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది

V6 Velugu Posted on Jan 18, 2022

  • ప్రొఫెసర్ కోదండరామ్

జహీరాబాద్, వెలుగు: ‘అందరం కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. రాష్ట్రం  కేసీఆర్ ​సొంత ఆస్తి కాదు’ అని టీజేఎస్ వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో 317 జీఓకు  వ్యతిరేకంగా టీజేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 317 జీఓ అప్రజాస్వామికమని, దీని ద్వారా ఎంప్లాయీస్,​టీచర్లకు నష్టం జరుగుతుందన్నారు. కేసీఆర్​ ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వానికి మనసుంటే వారికి న్యాయం చేయడం ఏమంత పెద్దపని కాదన్నారు. ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరుకోవద్దని,  టీచర్లు, ఉద్యోగులు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. ఉద్యమం చేస్తూనే కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు.  టీజేఎస్ నియోజకవర్గ ఇన్​చార్జి  ఆశప్ప, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల లీడర్లు రామ్ చందర్ పాల్గొన్నారు.

Tagged Telangana, CM KCR, teachers, Employees, Kodandaram, TJS, 317 GO

Latest Videos

Subscribe Now

More News