
తెలంగాణలో రాజకీయాలు కలుషితమయ్యాయన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణ జన సమితి పార్టీ ప్లీనరి సమావేశంలో మాట్లాడిన ఆయన..జయశంకర్ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పారు. సమస్యలపై పోరాటం చేసే వారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ ఆదరిస్తుందన్నారు. అమరుల త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. అమరుల స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. సబ్బండ వర్ణాల కృషి వల్లే రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.