కొడంగల్, వెలుగు: ప్రయాణికుల రద్దీతో నిత్యం కిక్కిరిసే కొడంగల్ బస్‌స్టేషన్‌ను ఆధునీకరించి రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపడతామని టీజీఆర్‌టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం కొడంగల్‌లో పర్యటించిన ఆయన బస్‌స్టేషన్‌ను పరిశీలించి, ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త బస్టాండ్‌తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
