క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా కోడి బుర్ర

క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా కోడి బుర్ర

శ్రీరామ్, శ్రుతీ మీనన్ జంటగా చంద్రశేఖర్ కానూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కోడి బుర్ర’.  వీ4 క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. సోమవారం ఫిలిం నగర్ టెంపుల్‌‌‌‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్ కొట్టారు.  దర్శకుడు భరత్ కమ్మ టీమ్‌‌‌‌కు స్క్రిప్ట్ అందజేశారు. అందరికీ నచ్చే కంటెంట్‌‌‌‌తో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఉండబోతోందని హీరో శ్రీరామ్ చెప్పాడు. ఇందులో శ్రీరామ్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడని, ఈనెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలియజేశారు.  ఆరుషి, మహావీర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.