రోహిత్, కోహ్లీ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు కదా..

రోహిత్, కోహ్లీ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు కదా..

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని సాధించింది.  మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తేడాతో దక్కించుకుంది.  ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆసీస్..20ఓవర్లలో 7వికెట్లుకు 186 పరుగులు చేసింది. 187పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా.. 19.5ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి  ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ 69 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 63 రన్స్ సాధించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 25 పరుగులతో  కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టను విజయతీరాలకు చేర్చాడు. 

రోహిత్, కోహ్లీ సెలబ్రేషన్స్..
మరికొద్ది సేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా..కోహ్లీ ఔటయ్యాడు.  ఫించ్ క్యాచ్ పట్టడంతో.. కోహ్లీపెవిలియన్ చేరాడు. కోహ్లీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లకుండా మెట్ల మీదే కూర్చుని మ్యాచ్ ను చూస్తున్నాడు. అతని  పక్కనే రోహిత్ శర్మ... వెనకాల తర్వాత బ్యాటింగ్‌కు దిగాల్సిన హర్షల్ పటేల్ ఉన్నారు.

 19 ఓవర్ మూడో బాల్కు దినేష్ కార్తీక్  సింగిల్ తీశాడు. నాలుగో బంతికి పాండ్య  రన్స్ చేయకపోవడంతో..మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ తరుణంలో విజయానికి  2 బంతుల్లో 4పరుగులు కావాలి. అయితే 5వ బంతికి హార్దిక్ కట్ షాట్ ఆడగా.. బంతి బ్యాక్ సైడ్ ఫోర్ వెళ్లింది. దీంతో ఇండియా మరో బంతి ఉండగానే విజయం సాధించింది.  మెట్లపై కూర్చుని టెన్షన్ టెన్షన్గా మ్యాచ్ చూస్తున్న కోహ్లీ, రోహిత్.. భారత్ గెలుపుతో ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయారు.  రోహిత్, కోహ్లీ ఒకరినొకరు హైఫై ఇచ్చుకుంటూ హగ్ చేసుకున్నారు. ఇద్దరు  ఆనందంతో చిన్నపిల్లలయిపోయారు.