4వేల రన్స్ చేసిన ఫస్ట్ క్రికెటర్ కోహ్లీ

4వేల రన్స్ చేసిన ఫస్ట్ క్రికెటర్ కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు.  టీ20 ఫార్మాట్లో 4 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న  ఫస్ట్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.  ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్లో కోహ్లీ ఈ రికార్డును సాధించాడు.  ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు 4 వేల పరుగుల మైలు రాయిని చేరుకునేందుకు కోహ్లీకి 42 పరుగులు అవసరం అయ్యాయి. అయితే  కాగా, ఈ మ్యాచ్‌లో 50 పరుగులు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. 15వ ఓవర్‌లో అదిల్ రషీద్ బౌలింగ్లో ఫోర్ బాది కోహ్లీ రికార్డును నెలకొల్పాడు. 

కోహ్లీదే అగ్రస్థానం..
టీ20ల్లో కోహ్లీ ఇప్పటి వరకు 115 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 4008 పరుగులతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 36 హాఫ్ సెంచరీలున్నాయి. కోహ్లీ తర్వాత 3,853 పరుగులతో  రోహిత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు గప్తిల్ 3497 పరుగులతో మూడో స్థానంలో..., పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ 3323 పరుగులతో నాల్గో స్థానంలో..., ఐర్లాండ్‌ ఆటగాడు స్టిర్లింగ్‌ 3181 పరుగులతో ఐదో స్థానంలో  కొనసాగుతున్నారు.

100 బౌండరీల రికార్డ్..
టీ20 ప్రపంచకప్‌లో 100 బౌండరీలు కొట్టిన ఆటగాడు కూడా కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 4 బౌండరీలు బాదడంతో..వంద బౌండరీల మార్కును చేరుకున్నాడు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ 2022లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచుల్లో  296 పరుగులు సాధించాడు. 

ఇదే టీ20 వరల్డ్ కప్2022 లో కోహ్లీ ఇప్పటికే ఓ ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. సూపర్ 12లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 64 పరుగులు చేయడం ద్వారా పొట్టి ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనె సాధించిన 1,016 పరుగులను అధిగమించాడు.